MLC Kavitha : కాసేపట్లో హైదరాబాద్ కు ఎమ్మెల్సీ కవిత

by Muthe.Rajitha |   (  Updated:2025-05-23 14:39:11  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు.

MLC Kavitha : కాసేపట్లో హైదరాబాద్ కు ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్(Hyderabad) చేరుకోనున్నారు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ డే కోసం అమెరికా వెళ్ళిన కవిత.. మరికాసేపట్లో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటుండగా, ఆమెకు స్వాగతం పలకడానికి తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Cheif KCR) కు గురువారం 'మై డియర్ డాడీ..' అంటూ కవిత రాసిన 6 పేజీల లేఖ(Kavitha Letter) రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేపింది. ఆ లేఖలో పార్టీ గురించి, కేసీఆర్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ లేఖపై గులాబీ నేతలు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడటానికి మొఖం చాటేశారు. ఈ లేఖపై కవిత మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే కవితకు స్వాగతం పలకడానికి విమానాశ్రయం చేరుకున్న జాగృతి కార్యకర్తలు అనూహ్యంగా గులాబీ రంగు జెండాలు, కండువాలు కాకుండా నీలి రంగు కండువాలు ధరించారు. స్వాగతం బ్యానర్లో కేసీఆర్, కేటీఆర్ ఫోట్లు లేకుండా కేవలం కవిత పేరుతో మాత్రమే దర్శనం ఇచ్చాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ పేరు కూడా ఎక్కడా కనిపించకుండా కటౌట్లు, ప్లక్ కార్డ్స్ ప్రదర్శించారు.

Next Story