- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఇందల్వాయి రామాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సందర్శించారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో (Congress Govt Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారని మండిపడ్డారు. మహిళలకు 2500 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారం (Kalyana Lakshmi) కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా వెంటనే తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వేములవాడ రోజుకొక రాజన్న కోడె (Rajanna Kode) మరణిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆలయాలపై ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజన్న కోడెల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక ఇందల్వాయి రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని స్థానికులకు భరోసా కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని గ్రామాల్లో చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేశామని వివరించారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ హయాంలో రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తుకు చేశారు.






