- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC Kavitha: ఆ రెండు మహిళలను తక్కువ చేసి చూపుతున్నాయ్.. ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్
సోషల్ మీడియా (Social Media), ఓటీటీ (OTT)లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా (Social Media), ఓటీటీ (OTT)లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లోని తెలంగాణ భవన్(Telangana Bhavan)లో అట్టహాసంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ (International Women's Day) వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ.. ఓటీటీ (OTT)ల రూపంలో అశ్లీలత (Pornography) ఏకంగా ఇళ్లలోకే వచ్చేసిందని కామెంట్ చేశారు. మహిళలపై నిత్యం జరుగుతోన్న అఘాయిత్యాలకు రీల్ సన్నివేశాలు కూడా ప్రధాన కారణమని ఆరోపించారు.
ఓటీటీ (OTT)లో అభ్యంతర కంటెంట్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళామణులు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఆడవాళ్లను తక్కువ చేసి చూపించే.. ఓటీటీ కంటెంట్ (OTT Content)ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. తాను చిన్నతనంలో ఉన్నప్పుడు వీధుల్లో అశ్లీల పోస్టర్లను మహిళలంతా కలిసి చించి తగులబెట్టే వారని గుర్తు చేశారు. గడిచిన పదేళ్ల కాలంలో అవే అశ్లీల పోస్టర్లను రాష్ట్రంలోని మహిళా సంఘాలు వెళ్లి తగులబెట్టిన ఘటనను తనకు కనిపించలేదని అన్నారు. రానున్న రోజుల్లో మహిళ అంటే బొమ్మ కాలు.. అమ్మ అని తెలియజేసేలా రాష్ట్రంలోని మహిళలంతా పోరాటానికి ముందుకు రావాలని కవిత పిలుపునిచ్చారు.






