MLC Kavitha: ఉద్యమ తల్లిని.. కాంగ్రెస్ తల్లిగా మార్చేశారు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana) ఉద్యమ తల్లిని కాంగ్రెస్ (Congress) తల్లిగా మార్చేశారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు.

MLC Kavitha: ఉద్యమ తల్లిని.. కాంగ్రెస్ తల్లిగా మార్చేశారు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) ఉద్యమ తల్లిని కాంగ్రెస్ (Congress) తల్లిగా మార్చేశారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు. ఇవాళ సెక్రటేరియట్ (Secretariat) ఆవరణలో తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సీఎంపై ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖలను పూర్తిగా మార్చేసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విగ్రహాన్ని ఆవిష్కరించడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని ఆరోపించారు. ఉద్యమ తల్లిని.. నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చేశారని ఫైర్ అయ్యారు.

రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ (Congress) తల్లి విగ్రహావిష్కరణను తాము తిరస్కరిస్తున్నామని అన్నారు. కోట్లాది మందిలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. బతుకమ్మ (Bathukamma)తో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణ (Telangana)లో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని అన్నారు. ఆ తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను కూడా దూరం చేశారని ఆక్షేపించారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన పార్టీకి తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్క లేదని.. ఒకవేళ పని చేయాలనుకుంటే గన్‌పార్క్ (Gun Park) వద్ద సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముక్కు నెలకు రాయాలంటూ కవిత ట్వీట్ చేశారు.

Next Story