అనుమతివ్వని పోలీసులు.. MLC కవిత కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేయనున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ప్రకటించిన విషయం తెలిసిందే.

అనుమతివ్వని పోలీసులు.. MLC కవిత కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేయనున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఆమె తలపెట్టిన దీక్షకు పోలీసులు(Telangana Police) అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా 72 గంటల నిరాహర దీక్ష చేసి తీరుతానని ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) సాధించే వరకు విశ్రమించబోమనని అన్నారు. బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయనున్నట్టు చెప్పారు. బీసీ బిల్లు సాధన విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే.. అన్ని పార్టీలతో వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.

Next Story