- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మీ చేతుల్లోనే ఉంది.. తొలి విజయం సాధించండి’: బీజేపీ రాంచందర్ రావుకు కవిత సూచన
బీసీ రిజర్వేషన్(BC Reservation) బిల్లుపై బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్(BC Reservation) బిల్లుపై బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే రైల్ రోకోను విజయవంతం చేయాలని కోరారు. జులై 17వ తేదీన బీసీ బిల్లు సాధించేందుకు రైల్ రోకో కార్యక్రమం చేయబోతున్నామని అన్నారు. రైల్ రోకో కార్యక్రమానికి వివిధ పార్టీల మద్దతు కూడ గట్టాము.. బీసీ బిల్లుపైన బీజేపీ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ నూతన అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao)కు లెటర్ కూడా రాసినట్లు తెలిపారు. ఆయన చొరవ తీసుకొని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం సాధించాలని సూచించారు.
కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్‌లో ఎన్నడు మాట్లాడలేదని అన్నారు. మల్లిఖార్జున్ ఖర్గే బీసీలకు 42 రిజర్వేషన్ అమలు అయ్యేలా బీజేపీపైన ఒత్తిడి తేవాలని హితవు పలికారు. కులగణన వివరాలు బయట పెట్టాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. కానీ ప్రభుత్వ పెద్దలు పాత లెక్కలే చెబుతున్నారు.. గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జూలై 17న రైల్ రోకో నిర్వహించి తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్ళే ప్రతి రైలును ఆపి నిరసన కార్యక్రమం విజయవంతం చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించేందుకు బీజేపీపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు.
‘బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ(Congress Govt) మెతక వైఖరి కనబరుస్తోంది. బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని కూడా అన్నారు.. ఇకనైనా రేవంత్ రెడ్డి బనకచర్లను ఆపాలని గట్టిగా కొట్లాడాలి’ అని కవిత సూచించారు. అంతేగాకుండా.. రైల్ రోకో కార్యక్రమానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు కవిత సమాధానం ఇచ్చారు. తానే బీఆర్ఎస్ పార్టీ.. రైల్ రోకోకు బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుందని అన్నారు. అనంతరం రైల్ రోకో పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.






