- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పరీక్షను వెంటనే వాయిదా వేయాలి.. ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత సూచన
ఈ నెల 14వ తేదీన రాష్ట్రంలో రెండో విడత పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా అదే రోజున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీ రాత పరీక్ష ఉంది. అ

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 14వ తేదీన రాష్ట్రంలో రెండో విడత పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా అదే రోజున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీ రాత పరీక్ష ఉంది. అయితే ఆ పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రభుత్వానికి సూచించారు. వేలాది మంది గ్రామీణ ప్రాంత అడ్వకేట్లు అయితే ఓటుకు లేదంటే ఏపీపీ రాత పరీక్షలకు దూరం కావాలా? అని ప్రశ్నించారు. ఈనెల 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
అదే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్షలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తోందని తెలిపారు. జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ లో పరీక్ష నిర్వహిస్తుండటంతో వేలాది మంది గ్రామీణ ప్రాంతాల న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని తెలిపారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని ఈనెల 14న తలపెట్టిన ఏపీపీ రాత పరీక్షలను వాయిదా వేసేలా టీజీఎస్పీఆర్బీ కి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.






