ప్రభుత్వం మరింత అప్రమత్తం కావాలి: Kalvakuntla Kavitha

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-28 06:46:56  IST  )

తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రింత అప్ర‌మ‌త్తం అవ్వాల‌ని ఎమ్మెల్సీ క‌విత సూచించారు.

ప్రభుత్వం మరింత అప్రమత్తం కావాలి: Kalvakuntla Kavitha
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రింత అప్ర‌మ‌త్తం అవ్వాల‌ని ఎమ్మెల్సీ క‌విత సూచించారు. వాతావ‌ర‌ణ శాఖ రాష్ట్రంలోని 10 జిల్లాల‌కు ఫ్లాష్ ఫ్ల‌డ్స్ అల‌ర్ట్ ఇచ్చిన నేప‌థ్యంలో కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మ‌ల్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, మెద‌క్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అన్ని పార్టీల నేత‌లు త‌మ కార్య‌క‌ర్త‌లు స‌హాయ‌క‌చ‌ర్య‌ల్లో పాల్గొనాల‌ని కోరుతున్నారు. చాలా మంది నాయ‌కులు వ‌ద‌ర ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Next Story