టీటీడీ చైర్మన్‌తో MLC కవిత భేటీ

by Gantepaka Srikanth |

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.

టీటీడీ చైర్మన్‌తో MLC కవిత భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. తిరుపతి హతిరామ్ బావాజీ మఠంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బంజారా పీఠాధిపతులకు పూజలు చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న హరితామ్ బావాజీ జయంతి సందర్భంగా బంజారా (సుగాలి, లంబాడీ) పీఠాధిపతులు, పూజారులకు మఠంలో ప్రత్యేకంగా పూజలు చేసే అవకాశం కల్పించడంతోపాటు నైవేద్యం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. త్వరలోనే హతిరామ్ బావాజీ పీఠం నిర్వాహకులు, గిరిజన పీఠాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఈ మేరకు బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు. హరిరామ్ బావాజీ మఠంలో పూజలు చేయడానికి, హారతి ఇవ్వడానికి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 30న హతిరామ్ బావాజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడానికి, నైవేద్యం సమర్పించడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు కవిత అన్నారు.

Next Story