MLC Kavitha: అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్

by Gantepaka Srikanth |

అది కాళేశ్వరం క‌మిష‌న్ కాదని.. కాంగ్రెస్ క‌మిష‌న్ అని ఎమ్మెల్సీ క‌విత ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు కాళేశ్వరం క‌మిష‌న్ నోటీసులు ఇవ్వడాన్ని ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

MLC Kavitha: అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అది కాళేశ్వరం క‌మిష‌న్ కాదని.. కాంగ్రెస్ క‌మిష‌న్ అని ఎమ్మెల్సీ క‌విత ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు కాళేశ్వరం క‌మిష‌న్ నోటీసులు ఇవ్వడాన్ని ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ప్రజల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన‌ ప్రజానాయకుడు కేసీఆర్‌ అని తెలిపారు. దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రజా ప్రయోజ‌నాల‌ కోసం నిర్మించిన‌ బృహత్ ప్రాజెక్టు అని తెలిపారు. తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను గళగళా తరలించడానికి కట్టిన ప్రాజెక్టు అని తెలిపారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్‌ కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరమని పేర్కొన్నారు. ఎన్ని కమిషన్లు ఏర్పాటు చేసినా తప్పకుండా న్యాయం గెలుస్తుందని.. నిజాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు.

Next Story