- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ సర్కార్ ఎదుట MLC కవిత కీలక డిమాండ్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Bansuada)లో 1962లో ప్రారంభించిన గ్రంథాలయం(Library) శిథిలావస్థకు చేరింది.

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Bansuada)లో 1962లో ప్రారంభించిన గ్రంథాలయం(Library) శిథిలావస్థకు చేరింది. నూతన భవన నిర్మాణం పూర్తయ్యేవరకు తాత్కాలికంగా స్థానిక జయశంకర్ మినీ క్రీడా మైదానం(Jayashankar Mini Sports Ground)లో రెండు గదులు కేటాయించి అక్కడకు మార్చారు. దీంతో నూతన భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని.. శంకుస్థాపన చేసి ఏడాది అవుతోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మైదానానికి రోజూ వందల సంఖ్యలో క్రీడాకారులు వస్తుండటంతో గ్రంథాలయానికి వచ్చేవారి ఏకాగ్రత దెబ్బతింటోందని అంటున్నారు. తాజాగా.. ఈ అంశంపై బీఆర్ఎస్(BRS) మహిళా నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
‘‘విజ్ఞానాన్ని పెంచి ఉజ్వల భవిష్యత్తును అందించే గ్రంథాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) విస్మరిస్తున్నది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. ఏడాది గడుస్తున్నా నిర్మాణ పనులు మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు. తాత్కాలికంగా ఇరుకు గదిలో ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో స్థలం సరిపోక ఉద్యోగార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే నూతన గ్రంథాలయ భవన పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాను’ అని కవిత సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
విజ్ఞానాన్ని పెంచి ఉజ్వల భవిష్యత్తును అందించే గ్రంథాలయాలను విస్మరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం కోసం కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. ఏడాది గడుస్తున్న నిర్మాణ పనులు మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు.… pic.twitter.com/0j1jmuXRzX
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 19, 2025






