- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Teej Festival: తీజ్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించాలి లేదంటే.. ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్
తీజ్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Teej Festival) తీజ్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో బంజార తీజ్ ఫెస్టివల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు. తొమ్మిది రోజుల పాటు ఏవిధంగానైతే బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటామో.. అలాగే తొమ్మిది రోజుల పాటు తీజ్ పండుగను జరుపుతారని తెలిపారు. బంజార సంస్కృతిలో భాగమైన తీజ్‌ను ఫ్యూచర్‌లో రాష్ట్ర పండుగగా గుర్తించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి పని చేయట్లేదని విమర్శలు గుప్పించారు. కనీసం ఇది వరకు మాదిరి నీరు, కరెంటు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. తీజ్‌ను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించకపోతే.. మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని హాట్ కామెంట్స్ చేశారు. అప్పుడు తీజ్‌ను రాష్ట్ర పండుగా ప్రకటించుకుందామని తేల్చి చెప్పారు. ఇక, (Kharmanghat) కర్మన్‌ఘాట్‌లోని కాలనీ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తన వంతు సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు.






