దేశాన్ని రెండుగా చీల్చేందుకు బీజేపీ కుట్ర.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |
దేశాన్ని రెండుగా చీల్చేందుకు బీజేపీ కుట్ర.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలను బూచిగా చూపి దేశాన్ని రెండుగా చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగానే మతం పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని మండిపడ్డారు. దేశంలో రిజర్వేషన్లను కూడా తొలగించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని ఫైర్ అయ్యారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోడీకి లేదని అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలో బీసీ, ఎస్టీ, ఎస్సీల హక్కులు కాపాడుతామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

Next Story