- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ షురూ..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో 3 ఎమ్మెల్సీ స్ధానాలు, తెలంగాణ (Telangana)లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రమే అన్ని పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో సహా, పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లిపోయారు. అదేవిధంగా ఎన్నికల కోసం అధికారులను స్పెషల్ అబ్జర్వర్లను నియమించారు. అదేవిధంగా ప్రైవేటు విద్యాసంస్థలు, ఇతర ఆఫీసుల్లో పనిచేసే వారు ఓటు హక్కును వినియోగించుకునేలా వారికి అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ (Telangana)లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 3,55,159 ఓటర్లు ఉండగా అధికారులు 499 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 56 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక మెదక్ -నిజామాబాద్-ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓటర్లు ఉన్నారు. అక్కడ అధికారులు 274 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 15 మంది టీచర్ ఎమ్మెల్సీ (Teacher MLC) అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు వరంగల్-ఖమ్మం- నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్త 25,797 ఓటర్లు ఉండగా.. 200 పోలింగ్ స్టేషన్ల (Polling Stations)ను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇలా..
ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాలు, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ మేరకు అధికారులు 1,062 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అందులో టీడీపీ (TDP)), పీడీఎఫ్ (PDF) అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.






