మైనంపల్లి.. నీ గత చరిత్ర అందరికీ తెలుసు.. జాగ్రత్తగా మాట్లాడు: MLC భానుప్రసాద్

by Disha Web Desk 19 |
మైనంపల్లి.. నీ గత చరిత్ర అందరికీ తెలుసు.. జాగ్రత్తగా మాట్లాడు: MLC భానుప్రసాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మైనంపల్లి.. నీ గత చరిత్ర అందరికీ తెలుసు అని, స్థాయి తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్ హెచ్చరించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి మాట్లాడిన తీరును ఖండిస్తున్నామన్నారు.

బీఆర్ఎస్‌లో ఉన్న పెద్ద నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజకీయ నాయకుడిగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తున్న నాయకుడు హరీష్ రావు అని, బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజకీయ హోదాలో, పార్టీలో ఉండి పార్టీ లైన్ దాటి మాట్లాడటం మంచిది కాదని సూచించారు. పార్టీ అధిష్టానం స్పందించి కచ్చితంగా మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వేంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుమలలో ఇలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ రౌడీ లాగా, బెదిరించే ధోరణిలో మైనంపల్లి మాట్లాడారని మండిపడ్డారు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. హరీష్ రావు కు, పార్టీకీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మైనంపల్లిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.


Next Story