జగన్ గాలి మనిషి.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
జగన్ గాలి మనిషి.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ గాలి మనిషి అని, చివరకు గాలి పైనా ట్యాక్స్ వేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా డోన్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ ఇచ్చింది వాలంటీర్ ఉద్యోగమని, తాను ఇచ్చింది ఐటీ ఉద్యోగమని చంద్రబాబు గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగాలకు గ్యారంటీ ఉందని తెలిపారు. తాను తొలి సంతకం చేసేది డీఎస్సీపైనేని హామీ ఇచ్చారు. జాబు కావాలంటే బాబు రావాల్సిందేనని చెప్పారు. కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. బీసీలే తన ప్రాణమని, తన ఊపిరని తెలిపారు. బీసీలకు రుణపడి ఉంటానని, న్యాయం చేస్తానని తెలిపారు. పట్టాదారు పుస్తకం సర్వే రాళ్లపై జగన్ ఫొటో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. జగన్ తాత రాజారెడ్డి ప్రజలకు ఆస్తులు ఇచ్చాడా అని నిలదీశారు. ప్రజల భూములన్నీ జగన్ పేరుతో రాసేసుకున్నారని, అది చాలా ప్రమాదకరమని మండిపడ్డారు. బ్రిటీష్ హయాంలో నుంచి ప్రజల రికార్డులన్నీ పదిలంగా ఉన్నాయని, కానీ భవిష్యత్తులో ఏవీ ఉండవన్నారు. అన్ని ఆన్ లైన్‌లో పెట్టేస్తారట అని ఎద్దేవా వేశారు. జగన్ ఆన్‌లైన్‌లో మారిస్తే ప్రజల జాతకాలు మారిపోతాయని, భూములు కొట్టేయడానికి పథకాలు రచిస్తున్నారని చంద్రబాబు హెచ్చరించారు.

Read More..

పొన్నూరు సభలోనూ సేమ్ టు సేమ్.. గేర్ మార్చాలంటున్న విశ్లేషకులు

Next Story

Most Viewed