- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండా మురళి పిచ్చి మాటలు మానుకోవాలి: ఎమ్మెల్సీ వార్నింగ్
కాంగ్రెస్ నేత కొండామురళినపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి పిచ్చిమాటలు మానుకోవాలని హెచ్చరించారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి కొండా తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నేత కొండామురళినపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి పిచ్చిమాటలు మానుకోవాలని హెచ్చరించారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి కొండా తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. షో కాజ్ నోటీసులు ఇస్తే మళ్లీ వెళ్లి తనను ఎవరూ పిలవలేదని అంటున్నాడని చెప్పారు. కొండా కుటుంబానికి క్రమశిక్షణ సంఘంపై కూడా విశ్వాసం లేదని అన్నారు. పార్టీలు మారలేదని చెప్పుకుంటున్న కొండా కుటుంబం అన్ని పార్టీలు మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 38 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీని బతికించానని కొండా చెప్పారని, అసలు ఆయనకు రాజకీయ జన్మ ఇచ్చింది టీడీపీ పార్టీ అని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చరిత్ర కొండా మురళి కుటుంబానిది అని విమర్శించారు. కులాన్ని అడ్డం పెట్టుకుని కొండా మురళి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. అన్ని పార్టీలను ఆయన తిడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి కొండా మారుతాడన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కేసీఆర్ కొండాకు టికెట్ ఇవ్వలేదని అన్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన నేతలపై కొండా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆ నేతలంతా హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి, బీఆర్ఎస్ నుండి వచ్చిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.






