మీది కల్వకుంట్ల కుటుంబం కాదు కలహాల కుటుంబం: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

by Ajay Maddhiboyina |

కల్వకుంట కుటుంబం కాస్త కలహాల కుటుంబంగా మారిందని, కేటీఆర్ ప్రతి సారి ప్రశ్నిస్తా, నిలదీస్తా అని కాంగ్రెస్​పార్టీని అనడం మానుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​హెచ్చరించారు.

మీది కల్వకుంట్ల కుటుంబం కాదు కలహాల కుటుంబం: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కల్వకుంట కుటుంబం కాస్త కలహాల కుటుంబంగా మారిందని, కేటీఆర్ ప్రతి సారి ప్రశ్నిస్తా, నిలదీస్తా అని కాంగ్రెస్​పార్టీని అనడం మానుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​హెచ్చరించారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ప్రజలకు ఉన్న అనుమానాలు ఉన్నాయన్నారు. తాము మాట్లాడే మాటలకు, తమ సోదరి కవిత లేఖలోని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. బీజేపీ, బీఆర్​ఎస్​కు ఉన్న సంబంధమేమిటని, మీ పార్టీ ప్లీనరీలో బీజేపీ పై విమర్శలు చేయకపోవడం కారణమేమిటని ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్​ఎస్ ​అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి లాభం చేకూర్చడం కాదా అన్నారు.

బడుగు బలహీన వర్గాల మేలు కోసం మా ప్రభుత్వం చేసిన బీసీ కులగణ, ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడకపోవడం దేనికి సంకేతమన్నారు. మీది కల్వకుంట కుటుంబం కాదు కలహాల కుటుంబమని స్వయంగా మీ చెల్లె మిమ్మల్ని ప్రశ్నిస్తూ లేఖ రాసిందన్నారు. మీ వ్యవహారాలపై మీ చెల్లెకే ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. కుటుంబమే సక్కగా లేన్నపుడు నువ్వు బయటికి వచ్చి మా పాలనపై విమర్శించే హక్కు నీకు ఉందో లేదో నువ్వే ఆలోచన చేసుకోవాలని హితువు పలికారు. మీ చెల్లి కవిత అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని, తర్వాత బయటికి వచ్చి నీతులు మాట్లాడాలని ఎద్దేవా చేశారు.

Next Story