- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Addanki Dayakar: కేసీఆర్ ఇకనైనా పగటి కలలు మానాలి
by Gantepaka Srikanth |
జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన కామెంట్లపైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన కామెంట్లపైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. కేసీఆర్ తెలంగాణ బకాసూరుడని, బీజేపీతో దోస్తీ కోసం ఆ పార్టీ తెలంగాణ అవమనిస్తే కూడా మాట్లాడని మీరు.. ఇప్పుడు మీ రాజకీయ స్వార్థం కోసం బయటకు వచ్చారని ఆయన మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీ రాజకీయాలను భూస్థాపితం చేసింది ప్రజలని, తెలంగాణకు నయవంచన చేసి సర్వం దోచుకున్న కేసీఆర్ అండ్ కోలు పగటి కలలు కనొద్దని ఆయన హితవు పలికారు. ప్రజలను గాలికి వదిలేసిన మిమ్మల్ని ప్రజలే రాజకీయంగా భూస్థాపితం చేస్తారని అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణలో మల్లీ రేవంత్ రెడ్డి సీఎంగా రావడం ఖాయం, కేసీఆర్ బీజేపీకి పోవడం ఖాయమన్నారు.
Next Story






