- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Addanki Dayakar: కేటీఆర్ బాంబు తుస్సుమంది! అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్
హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూముల వెనకాల రూ.10వేల కోట్ల స్కామ్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హెచ్‌సీయూ (HCU) కంచ గచ్చిబౌలి భూముల వెనకాల రూ.10వేల కోట్ల స్కామ్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) స్పందించి.. కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ బాంబు పేలుస్తాడని చెప్పారని, అయితే కేటీఆర్ (KTR) తుస్సు బాంబు పేల్చాడని ఆయన సెటైర్లు వేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవాలేనని, ఎలాంటి ఆధారాలు లేకుండా చెత్త స్టేట్మెంట్లు ఇస్తున్నాడని మండిపడ్డారు. దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం డబ్బు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వాన్ని ఏ విధంగా అభాసుపాలు చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. సంక్షేమ పథకాలకు, డెవలెప్‌మెంట్ కోసం ప్రభుత్వానికి ఏవిధంగానైనా డబ్బులు రాకుండా చేయడం కోసం బీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.
హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో (CM Revanth Reddy) రేవంత్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భూముల వెనకాల రూ.10వేల కోట్ల భారీ స్కామ్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక బీజేపీ ఎంపీ సహకారంతో ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీతో కుమ్మక్కై హెచ్‌సీయూ భూములు అమ్మాలని చూశారని ఆరోపించారు. నెక్ట్స్ ఎపిసోడ్‌లో ఆ బీజేపీ (BJP) ఎంపీ పేరు బయట పెడతానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చారని, రేవంత్ రెడ్డి ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కారని కేటీఆర్ ఆరోపించారు.






