- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగుల్లారా.. వారిని సీఎం వద్దకు తీసుకెళ్తా! లైబ్రరీ మీటింగ్‌పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ట్వీట్
హైదరాబాద్‌లోని చిక్కిడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో తాజాగా కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు..

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని చిక్కిడపల్లి సెంట్రల్ లైబ్రరీలో (unemployed people) నిరుద్యోగులతో తాజాగా కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగ యువతతో ఆయన చర్చలు జరిపారు. కీలక నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగులు వంటి అంశాలపై నిరుద్యోగులతో అద్దంకి దయాకర్ వాడివేడిగా చర్చలు సాగించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగుల నుంచి కొంత చేదు అనుభవం ఎదురైంది. ఈ లైబ్రరీ మీటింగ్‌పై మంగళవారం అద్దంకి దయాకర్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా వివరాలు పంచుకున్నారు. నిరుద్యోగుల వద్దకే ప్రభుత్వం అంటూ తెలిపారు. చిక్కడపల్లి హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థి నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నానని వెల్లడించారు.
ఉద్యోగ నోటిఫికేషన్, నియామకాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. సమస్యపై అవగాహన ఉన్న విద్యార్థులను, సమస్యపై పట్టు ఉన్న లెక్చర్స్, అడ్వొకేట్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ నిరుద్యోగుల్లారా.. నిరాశ నిస్పృహలకు లోను కాకండి.. ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. మీ సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ మేరకు లైబ్రరీ మీటింగ్ ఫోటోలను షేర్ చేశారు.






