కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తుంది: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

by Ajay Maddhiboyina |

రేవంత్ కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తుంది అని, ఓట్ల సమయంలోనే రైతులకు పథకాలు వర్తింపజేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తుంది: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
X

దిశ‌, వెబ్ డెస్క్: రేవంత్ కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తుంది అని, ఓట్ల సమయంలోనే రైతులకు పథకాలు వర్తింపజేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్ రెడ్డి ఆరోపించారు. ఓట్లు లేకుంటే రైతులకు ఇచ్చే పథకాలను ఎగ్గొడుతూ వాటి ఊసు ఎత్తడం లేదని విమర్శించారు.నిజమాబాద్ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోనే రైతులకు డైరెక్ట్ గా నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టిన రైతు బాంధవుడు కేసీఆర్ అన్నారు. మొదటిసారి నేరుగా రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రైతులు నాట్లు వేసేటప్పుడే కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడన్నారు.

కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లప్పుడు మాత్రమే రైతుబంధు ఇస్తుంద‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు పంట సీజన్ లు వచ్చాయని తెలిపాడు. మొదటిసారి.. ఎంపీ ఎన్నికలు ఉండటం వల్ల రైతు బంధు ఇచ్చాడని, అవి కూడా కేసీఆర్ రైతు బంధు కోసం ఉంచిన డబ్బులే ఇచ్చాడన్నారు. రెండోసారీ...ఏ ఎన్నికలు లేనందు వల్ల రైతు భరోసా ఎగ్గొట్టాడని విమ‌ర్శించారు. మూడోసారి...ఏ ఎన్నికలు లేనందున తూతూ మంత్రంగా 3 ఎకరాల వరకు ఇచ్చి మిగితా వారికి ఎగ్గొట్టాడన్నారు. నాలుగవ సారి... స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న దృష్ట్యా ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడని విమ‌ర్శించారు.

Next Story