- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం ది కామన్ సెన్స్ లేని వ్యవహరం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్
పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒక్క పాయింట్ లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

దిశ, తెలంగాణ బ్యూరో : నూతన సంవత్సరం కూడా ముఖ్యమంత్రి అవగాహనలేని వ్యాఖ్యలతోనే అసెంబ్లీ సమావేశం ప్రారంభమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఒకసారి కేసీఆర్‌ని గౌరవిస్తామని, మరోసారి ఉరి తీయాలని మాట్లాడటం కామన్ సెన్స్ లేని వ్యవహారమని వ్యాఖ్యానించారు. అధికార బలం, అహంకారం తప్ప పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఎలాంటి స్పష్టమైన అంశాలు లేవని ఆయన అన్నారు. బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన సమయంలో పిచ్చిపిచ్చి మాటలు, బూతులతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జూరాలకు క్రాప్ హాలిడే ఇచ్చిన మీరు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై వందల కేసులు వేసిన వ్యక్తిని ఇరిగేషన్ అడ్వైసర్‌గా పెట్టుకోవడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. నీటి రంగంపై అవగాహన ఉన్న, తెలంగాణ ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి కలిగిన వారిని అడ్వైసర్‌లుగా నియమించాలని సూచించారు. దేవాదుల, బనకచర్ల ప్రాజెక్టులు ఏ బేసిన్‌లో ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో సీఎం ఉన్నారని విమర్శించారు. రాజ్యాంగంపై గౌరవం లేకుండా ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. పాలమూరు–రంగారెడ్డి అంశంపై బహిరంగ చర్చ పెట్టాలని, మంచి సలహాదారులను నియమించుకోవాలని డిమాండ్ చేశారు. పిచ్చి మాటలు మానేసి పాలనపై దృష్టి పెట్టాలని, ప్రజలను మోసం చేయకుండా విషయంపై అవగాహనతో మాట్లాడాలని డా. కల్వకుంట్ల సంజయ్ స్పష్టం చేశారు.






