నేను KCR కంటే ఎక్కువ చదివా: MLA Rasamayi Balakishan సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   (  Updated:2022-12-06 12:43:48  IST  )

మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేను KCR కంటే ఎక్కువ చదివా: MLA Rasamayi Balakishan సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల కంటే తాను ఎక్కువ చదువుకున్నానని అన్నారు. శంకరపట్నం మండలం కన్నాపూర్‌లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి సభలో పాల్గొన్న రసమయి బాలకిషన్.. తాను కూడా అంబేద్కర్ మాదిరిగానే చదువుకుని డాక్టరేట్, గోల్డ్ మెడల్ సాధించానని అన్నారు. పేద దళిత కుటుంబంలో పుట్టిన ఆయన ఉన్నత చదువులు చదువుకుని డాక్టర్ రసమయి బాలకిషన్‌గా మీ ముందు నిల్చున్నానని చెప్పారు. తాను టీచర్‌గానూ పని చేశానని, గోచి, గొంగడి పెట్టుకుని పాటలు పాడానని రసమయి తెలిపారు.

Next Story