- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5 నిమిషాలు చాలు మిమ్మల్ని చేతులతోనే చంపేస్తా.. ఓవైసీ బ్రదర్స్‌పై రెచ్చిపోయిన రాజాసింగ్
బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం వరంగల్ లో జరిగిన ఛత్రపతి జయంతి వేడుకల్లో రాజాసింగ్ పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం వరంగల్ లో జరిగిన ఛత్రపతి జయంతి వేడుకల్లో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 నిమిసాలు కాదు..15 ఏళ్లు సమయం ఇచ్చినా ఓవైసీ బ్రదర్స్ ఏం చేయలేరని అన్నారు. ప్రతి సభలో 15 నిమిషాలు అంటూ డైలాగ్ కొడుతున్నారని... మీకు దమ్ముంటే పదిహేను నిమిషాలు కాదు 5నిమిషాలు చాలని అన్నారు. గతంలో కూడా చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని మీ సెక్యురిటీ లేకుండా నేను కూడా సెక్యురిటీ లేకుండా వస్తానని అన్నారు.
ప్లేస్ మీరే డిసైడ్ చేయండి.. మీ అడ్డాకు రావాలా మీ ఇంటికి రావాలా అంటూ రెచ్చిపోయారు. ప్లేస్ మీరే డిసైడ్ చేయాలని ఛాలెంజ్ విసిరారు. తనకు కత్తులు, తుపాకులు వద్దని చేతులతోనే చంపేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు భారత్ పై ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్ కు లవ్ లెటర్ రాసేవాళ్లని.. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా సర్జికల్ , ఎయిర్ స్ట్రైక్ చేసే ప్రభుత్వం ఉందని అన్నారు. ఛత్రపతి శివాజీ నుండే మోడీ సర్జికల్ స్ట్రైక్ నేర్చుకున్నారని చెప్పారు.






