మళ్లీ బీజేపీలో చేరతా.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

త్వరలో తాను బీజేపీలో చేరతానని ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన తరవాత పార్టీకి రాజాసింగ్ దూరమైన సంగతి తెలిసిందే.

మళ్లీ బీజేపీలో చేరతా.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో తాను బీజేపీలో చేరతానని ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన తరవాత పార్టీకి రాజాసింగ్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీకి తానే నిజమైన సైనికుడిని అన్నారు. తప్పకుండా పార్టీలోకి వెళతానని చెప్పారు. ఇప్పుడు కాకపోయినా రేపు అయినా తన సొంతపార్టీకి వెళ్లాల్సిందే అని అన్నారు. ఢిల్లీ లేదా రాష్ట్ర పెద్దలు పిలిచిన రోజు తిరిగి పార్టీలో చేరతానని చెప్పారు. అంతే కాకుండా తాను గతంలో కూడా ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. అసెంబ్లీలో స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీకి వారి వారి నియోజకవర్గాల్లో స్వేచ్ఛ ఇవ్వాలని అప్పుడే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. ఏ క్షణం అయినా తనకు బీజేపీ పెద్దల నుండి పిలుపు వస్తుందని తెలుసు అని చెప్పారు. ఒకవేళ పిలుపు వస్తే పార్టీ పెద్దల నుండి స్వేచ్ఛ కావాలని కోరతాని, ఆ స్వేచ్చ దొరికితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో ఎలా కొట్లాడతామో చూడాలన్నారు.

Next Story