- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరెస్ట్‌కు ముందు వీడియో రిలీజ్ చేసిన రాజాసింగ్: MLA Raja Singh
దిశ, తెలంగాణ బ్యూరో : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణలో పెద్ద దుమారం రేపుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా రాజాసింగ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. మునావర్ షారుఖి ప్రోగ్రామ్ జరగడానికి కారణం టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే అంటూ విమర్శించారు. వీడియో రిలీజ్ చేయడానికి కారణం మునావర్ ఫారుఖి అని ఆయన అన్నారు. తాను మహమ్మద్ ప్రవక్త పై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మం కోసం నా ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని వీడియో ద్వారా రాజాసింగ్ తెలిపారు. తన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నానని చెప్పారు. పోలీసులకు ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి సమాధానం చెబుతాను అన్నారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటే దానికి కారణం ఎంఐఎం నేతలే అని రాజాసింగ్ మండిపడ్డారు.






