- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ పోస్టులు పెడితే ఖబడ్దార్.. రాజాసింగ్ వార్నింగ్
తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్న నకిలీ సోషల్ మీడియా ఖాతాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ తన పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై తీవర్ స్తాయిలో మండిపడ్డారు. తన పేరును వాడుకుంటూ నకిలీ ఖాతాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ఆదివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి వేదికల్లో నకిలీ ఖాతాల ద్వారా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, కల్పిత వార్తలు పోస్టు చేస్తున్నట్లు ఆయన గుర్తించారు. తప్పుడు ఐడీతో పోస్టులు చేస్తున్న ఫేస్ బుక్ ఐడీలను తన ఫిర్యాదులో పేర్కొంటూ ఇలాంటి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నాకు ఆ అకౌంట్లు లేవు:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రజలకు తన సోషల్ మీడియా ఖాతాలపై క్లారిటీ ఇచ్చారు. నాకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా యూట్యూబ్‌లో ఎటువంటి అధికారిక ఖాతాలు లేవు. నేను కేవలం ఎక్స్ (ట్విట్టర్) లోని నా వెరిఫైడ్ హ్యాండిల్ @TigerRajaSingh ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటానని తెలిపారు. నా ఎక్స్ ఖాతాలో లేని ఏ సమాచారాన్ని కూడా ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. ఒక ప్రజా ప్రతినిధి ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న అసాంఘిక శక్తులను గుర్తించి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏసీపీ సైబర్ క్రైమ్‌ను ఆయన కోరారు. ఆ నకిలీ పేజీలను తక్షణమే బ్లాక్ చేయాలని విన్నవించారు. నిర్ధారణ లేని వార్తలను తన పేరుతో ప్రచారం చేసే సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.






