- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ నిర్మూలిస్తామంటూ అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు ఏంటి.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి కేసులు నమోదు అవ్వకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ సజ్జనార్ స్టేట్మెంట్ ఇస్తూనే మరోవైపు ప్రభుత్వం మద్యం అమ్మకాలకు సమయం పెంచడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో 29లక్షల మంది డ్రగ్స్ సేవించేవాళ్లు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయని వాళ్లంతా ఎక్కడ నుండి తెప్పించుకుంటున్నారు అనే విషయం తెలంగాణ సీఎం, డీజీపీ చెప్పాలన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు యువత అంతా డ్రగ్స్ కు బానిసనలు అవుతున్నారని చివరికి పోలీసుల పిల్లలు కూడా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని చెప్పారు.
డ్రగ్స్ కారణంగా రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అన్నారు. ఓ హీరోయిన్ పేరు కూడా డ్రగ్స్ కేసులో వచ్చిందని ఇదివరకు కూడా అతడు అరెస్ట్ అయ్యాడని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు. కమిషన్ స్టేట్మెంట్ ఒకరోజుకేనా అని ప్రశ్నించారు. న్యూయర్ తరవాత డ్రగ్స్ ను పట్టించుకోరా అని ప్రశ్నించారు. పోలీసులకే డ్రగ్స్ సరఫరా చేసేవాళ్లతో సంబంధాలు ఉన్నాయని కమిషనర్ దానిపై దృష్టి పెట్టాలన్నారు. రౌడీ షీటర్లు ఏం చేసుకుంటారో చేసుకోండి అని సోషల్ మీడియాలో ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారని అయినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారని విమర్శించారు.
READ MORE ....






