వారికి హిందూ అమ్మాయిలే టార్గెట్.. రక్షాబంధన్‌‌ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక రిక్వెస్ట్

by Ramesh Naini |

రాఖీ పండుగ సందర్భంగా హిందూ మహిళలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక పిలుపునిచ్చారు.

వారికి హిందూ అమ్మాయిలే టార్గెట్.. రక్షాబంధన్‌‌ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక రిక్వెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాఖీ పండుగ సందర్భంగా (Hindu women) హిందూ మహిళలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) ప్రత్యేక పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక వీడియో విడుదల చేశారు. (Raksha Bandhan) రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక అని, ఈ మేరకు అన్నదమ్ములు రక్షణగా నిలవాలని సోదరీమణులు మాట తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే మహిళలు తనకు ఒక మాట ఇవ్వాలని రాజాసింగ్ రిక్వెస్ట్ చేశారు. భారత్‌లో నేడు లవ్ జిహాద్‌పై పెద్ద ఎత్తున్న కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి.. లవ్ జిహాద్ వైపు మళ్లీస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే చాలా ఘోరంగా హిందూ అమ్మాయిలను చంపేస్తున్నారని ఆరోపించారు. మొత్తం ముక్కులు ముక్కలుగా నరికి అతి కీరాతకంగా ఫ్రిజ్‌లో ప్యాక్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది అమాయక హిందూ మహిళలు (Love Jihad) లవ్ జిహాద్‌లో చిక్కుకుంటున్నారని ఆవేదన చేశారు. నేడు భారత్‌లో లవ్ జిహాద్ వాతావరణం క్రియేట్ అయిందని వెల్లడించారు. హిందూ మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ లవ్ జిహాద్ వైపు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. హిందువుగానే జీవించాలనే మాట ఇవ్వాలన్నారు. లవ్ జిహాద్ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీనిపై హిందూ సంఘాలు పోరాడుతున్నాయని, తాము చేస్తున్న ప్రయత్నాలకు హిందూ మహిళలు సహకరించాలని, రక్షాబంధన్ సందర్భంగా తనకు మాట ఇవ్వాలని ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు.

Next Story