- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మజ్లిస్‌ను గెలిపిస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఖతమైనట్లే: కేటీఆర్ వ్యాఖ్యలపై రాజాసింగ్ హెచ్చరిక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సంచలన ప్రకటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన సంచలన ప్రకటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బండారం బయటపడిందని హాట్ కామెంట్స్ చేశారు. ఎంఐఎంను గెలిపించేందుకు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్ఎస్ దూరంగా ఉందని తెలిపారు. భాగ్యనగర్‌ను మజ్లిస్‌కు అప్పగించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర పన్నాయని ఆరోపించారు. ఈ మూడు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని సంచలన ఆరోపణలు చేశారు. భాగ్యనగర్‌లో బీఆర్ఎస్ పార్టీని పాతరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
(Congress) కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) కార్పొరేటర్లారా మజ్లిస్‌ను గెలిపిస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఖతమైనట్లేనని హెచ్చరించారు. ఓటింగ్‌లో పాల్గొనకపోవడమంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్లేనని, అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయండని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. కాగా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో శనివారం కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయవద్దని తమ పార్టీ నేతలను ఆదేశించారు. పోటీ చేసేందుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని అందుకే క్యాండిడేట్‌ను పెట్టడం లేదని చెప్పారు. ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీలతో సంబంధం లేదని కాబట్టి ఎవరికీ ఓటువేయవద్దని చెప్పారు. అసలు కౌన్సిల్ కే వెళ్లవద్దని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని అన్నారు.






