పోలీస్, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ఎమ్మెల్యే రాజా సింగ్ కృతజ్ఞతలు

by Malleboina Mahesh |

శ్రీరామనవమి శోభాయాత్ర విజయవంతంపై ఎమ్మెల్యే రాజా సింగ్ హర్షం. సహకరించిన అధికారులు, కార్యకర్తలు, భక్తులకు కృతజ్ఞతలు.

పోలీస్, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ఎమ్మెల్యే రాజా సింగ్ కృతజ్ఞతలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర (Sri Ram Navami procession) అత్యంత వైభవంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు జరిగింది. లక్షలాది మంది రామభక్తుల రాకతో విజయవంతంగా శోభాయాత్ర ముగియడంపై గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ (MLA T. Raja Singh) సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించడంలో అంకితభావంతో పనిచేసిన తెలంగాణ పోలీస్ శాఖ, జీహెచ్‌ఎంసీ (GHMC), జలమండలి (HMWS), విద్యుత్ శాఖ, ఆర్ అండ్ బీ (R&B) విభాగాలతో పాటు గోషామహల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయం వల్లే యాత్ర ఎటువంటి అవాంతరాలు లేకుండా సాగిందని ఆయన కొనియాడారు.

యాత్రలో పాలుపంచుకున్న కార్యకర్తలు, స్వాగత వేదికల నిర్వాహకులు, అన్నప్రసాద వితరణ చేసిన వారు, క్రమశిక్షణతో పాల్గొన్న ప్రతి రామభక్తుడికి రాజా సింగ్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భక్తుల అచంచలమైన భక్తి, ఉత్సాహం ఈ యాత్రను ఒక చారిత్రాత్మక వేడుకగా మార్చాయని ఆయన పేర్కొన్నారు. రామభక్తుల అంకితభావం భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తినిస్తుందని, ఈ అద్భుత విజయం అందరి సామూహిక కృషి ఫలితమేనని ఎమ్మెల్యే రాజా సింగ్ తన ట్విట్టర్ సందేశంలో వెల్లడించారు.

Next Story