- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kaushik Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. కౌశిక్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ (సోమవారం) (Telangana High Court) హైకోర్టు కొట్టివేసింది. సుబేదారీ పీఎస్‌లో తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో క్వారీ యజమాని మనోజ్‌ను కౌశిక్‌రెడ్డి బెదిరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ మనోజ్ నిర్వహిస్తున్నారు. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై సుబేదారీ పీఎస్‌లో కేసు నమోదు అయింది.
రూ.50 లక్షలు ఇవ్వాలంటూ కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆమె పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైనే కేసును కొట్టి వేయాలని ఏప్రిల్ నెలలో కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తన పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, ఇదే కేసులో కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. రాజకీయ కక్ష్యల కారణంగానే ఈ కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది నాడు కోర్టులో వాదనలు వినిపించారు.






