- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం అస్తవ్యస్థం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
‘‘కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా రంగం సర్వనాశనం అయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు..

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా రంగం సర్వనాశనం అయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు.. వాస్తవానికి బీఆర్ఎస్పాలనలో విద్యారంగం అస్తవ్యస్థంగా మారింది’’ అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ సీఎల్పీ మీడియా సెంటర్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ వెంట తిరిగి ప్రవీణ్ కుమార్ ఆబద్దాలు నేర్చుకున్నాడని అన్నారు. గురుకులాల కార్యదర్శిగా 8 ఏళ్ల పాటు పని చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యారంగాన్ని ఏం ఉద్ధరించాడు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోకుండానే విద్యారంగంపై చేస్తున్న విమర్శలపై ప్రవీణ్ కుమార్ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్థంగా గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు.
గురుకులాలకు అద్దె కూడా చెల్లించనప్పుడు కేసీఆర్ ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. పదేళ్ల పాటు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోయినా ఆర్ఎస్ మాట్లాడలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నారని, కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాం, బదిలీ లు, ప్రమోషన్లు ఇచ్చామని స్పష్టం చేశారు. బడుగు,బలహీన వర్గాల పిల్లలు చదివితే ప్రశ్నిస్తారన్న ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ తో కేసీఆర్ విద్యారంగాన్ని ధ్వంసం చేశాడని ఆరోపించారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను కేసీఆర్ ఎన్నికల ముందు తీసుకువచ్చి హడావిడి చేశారని పేర్కొన్నారు.
నియోజకవర్గానికి ఒక స్కూల్ లో పథకం ప్రారంభించి చివరకు ఆ నిధులను కూడా పెండింగ్ లో పెట్టి పోయాడన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను ప్రయోగాత్మకంగా కాంగ్రెస్ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. విద్యా రంగంలో తెలంగాణ ను దేశంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నాడని పేర్కొన్నారు. విద్యారంగంపై గోబెల్స్ ప్రచారం చేసేందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కేసీఆర్, కేటీఆర్ ముందు పెడుతున్నారని స్పష్టం చేశారు. ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్పార్టీ పై కక్ష వేధింపులకు దిగాల్సిన అవసరం కాంగ్రెస్ప్రభుత్వానికి లేదని పేర్కరొన్నారు. కేసీఆర్ కు జాతిపిత అనే బిరుదు ఎవరు ఇచ్చారు..? ఆయన జాతిపిత కాదు.. బూతు పిత అని, మహాత్మాగాంధీ సర్వం త్యాగం చేస్తే.. కేసీఆర్ మాత్రం తెలంగాణను సర్వం దోచుకున్నాడని ఈసందర్భంగా ఎమ్మెల్యే సత్యం ఘటుగా విమర్శించారు.






