రేవంత్ రెడ్డి పాలన కంటే కరోనా రోజులే బాగుండే: మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Mallareddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి పాలన కంటే కరోనా రోజులే బాగుండే: మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Mallareddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. రాష్ట్రంలో రియల్ ఏస్టేట్ రంగం(Telangana Real Estate Sector) పూర్తిగా కుదేలైందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడిందని.. అన్ని రంగాలుగా తెలంగాణ అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన కంటే.. కరోనా రోజులే బెటర్ అని తీవ్ర విమర్శలు చేశారు.

కరోనా రెండేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేసినా.. రియల్ ఏస్టేట్ రంగంపై ఏమాత్రం ప్రభావం పడలేదని.. కానీ.. ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. బిడ్డ పెండ్లికి భూమి అమ్ముదామంటే ఎవరూ కొనడం లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలనా విధానాలు, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని అన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమం కారణంగా రైతులు, యువత గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. అయితే.. గత 22 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న మాదిరిగా మారిందని విమర్శించారు.

Next Story