- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి.. ఎన్నికల పిటిషన్లపై విచారణ ముగించిన హైకోర్టు
బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి (Gachibowli AIG Hospital)లో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5.45కు తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2014 సాధరణ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ (Jubilee Hills) నుంచి మాగంటి గోపీనాథ్ పోటీ చేయగా.. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో వాస్తవాలను తొక్కిపెట్టారంటూ ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin), ఓటరు నవీన్ యాదవ్ (Naveen Yadav) హైకోర్టులో గోపినాథ్ ఎన్నిక చెల్లదంటూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌లో జూబ్లీహిల్స్ నియోజవర్గ పరిధిలోని 26 ఈవీఎంల్లో లోపాలు ఉన్నాయని, వీవీ ప్యాట్లు, పోలింగ్ ఏజెంట్లు సమర్పించిన ఓట్ల లెక్కకు పొంతన లేదని, ఆస్తుల వివరాలను సరిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. దీంతో తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌లను కొట్టివేయాలంటూ మాగంటి మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా.. మే 18న ఆ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే తాజాగా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి విషయాన్ని అడ్వొకేట్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం మాగంటి గోపీనాథ్ ఎన్నికల పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.






