బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం.. MLA మాగంటి గోపీనాథ్ కన్నుమూత

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-08 01:44:46  IST  )

బీఆర్ఎస్‌(BRS)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(MLA Maganti Gopinath) కన్నుమూశారు.

బీఆర్ఎస్‌లో తీవ్ర విషాదం.. MLA మాగంటి గోపీనాథ్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌(BRS)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(MLA Maganti Gopinath) కన్నుమూశారు. అనారోగ్యంతో ఇటీవల గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి(Gachibowli AIG Hospital)లో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5:45 కు తుదిశ్వాస విడిచారు. పరిస్థితి విషమంగా మారిందని తెలియడంతో శనివారం రాత్రే బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు ఆసుపత్రికి చేరుకున్నారు. మాగంటి గోపీనాథ్ మృతి వార్త తెలంగాణ రాజకీయ నాయకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు నాయకులు, ఆయన అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కాగా, మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ నుంచి గెలుపొందిన ఆయన.. 2018లో బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.

Next Story