- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ అసమర్థతతో ప్రాజెక్టులు పూర్తి కాలేదు: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం అయినా ప్రతి ఒక్కరిని విచారించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రియాజ్ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం అయినా ప్రతి ఒక్కరిని విచారించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రియాజ్ డిమాండ్ చేశారు. బుధవారం వారు గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఈఏన్సీ మరళీధర్ రావు దగ్గరే రూ.500 కోట్ల పైగా ఉన్నట్లు గుర్తించారు. ఆయన దగ్గరే అన్ని కోట్ల ధనం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ దగ్గర ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
వీరితో పాటు మిగిలిన అధికారులు శ్రీధర్, హరిరామ్ నాయక్ ల దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ అసమర్థతతో ప్రాజెక్టులు పూర్తి కాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు ఇరిగేషన్ శాఖను కేసీఆర్, హరీష్ రావే చూసారు. దోపిడీ దారుల ఆస్తులు జప్తు చేసి పేద ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డి సొంత ఊరికి రేషన్ కార్డు ఇచ్చావా? CM రేవంత్ రెడ్డి పై చిల్లర మాటలు మానుకోవాలంటూ సూచించారు.






