- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి రాసిన మరణ శాసనం! ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్
ఇటీవల చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన తల్లి, ఇంటర్ చదువుతున్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిచివేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన తల్లి, ఇంటర్ చదువుతున్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిచివేసింది. ఈ ఘటనపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తల్లి రాసిన మరణ శాసనం అంటూ సోమవారం ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘గుండెల్ని పిండేసే చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ ఘటన.. అమ్మ మాటే శిరోధార్యం, చనిపోదామని చెప్పినా ఒద్దనలేని పిల్లల నిస్సాహాయత.. తల్లితో పాటే ప్రాణాలను అర్పించిన త్యాగం.. నాన్నను ఒంటరి చేస్తున్నామనే దుఃఖం.. ఈ ఘటన నా హృదయాన్ని ఎంతో కలిచివేసింది. ఆ తల్లి తొందరపాటు నిర్ణయం వల్ల ఇద్దరు పిల్లల జీవితం ముగిసిపోయింది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, బోడుప్పల్ నివసించే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన విజయశాంతి రెడ్డి (38) కుమార్తె చైతన్య రెడ్డి(18) కుమారుడు విశాల్ రెడ్డి(17) శనివారం తెల్లవారు జామున చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల ఒకరినొకరు హత్తుకుని వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయిలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక, పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






