- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం మంత్రులపై రెచ్చిపోయిన కోమటిరెడ్డి.. మరోసారి హాట్ కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వం పరోక్ష విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వం పరోక్ష విమర్శలు చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. తాము నిధుల కోసం మంత్రుల చుట్టూ తిరగాలా? అని సీరియస్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు.. ప్రభుత్వం ఏం చేసినా ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయని టాక్ ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు.. మేము మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని అన్నారు.
మరోవైపు.. లిఫ్ట్‌లన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. నిర్ణయాలు, క్రమశిక్షణలో కరెక్ట్‌గా ఉంది. అలాగే నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు రాజగోపాల్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.






