ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy)కి హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది.

ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Koushik Reddy)కి హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది. సుబేదారి పోలీస్ స్టేషన్‌‌లో నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కొరుతూ తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాననం కీలక వ్యాఖ్యలు చేసింది. తనను అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కౌశిక్ రెడ్డి చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అదే కేసు తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. కాగా, కమలాపురం (Kamalapuram) మండల పరిధిలోని ఉన్న వంగపల్లి (Vangapally)లో క్వారీ నిర్వహిస్తున్న గ్రానైట్‌ వ్యాపారి మనోజ్‌ క్వారీని కౌశిక్ రెడ్డి బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.50 లక్షలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తమను బెదరించారంటూ మనోజ్‌ భార్య ఉమాదేవి సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసుల కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

Next Story