Kadiyam Srihari: కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kadiyam Srihari: కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Kalvakuntla family) కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం అక్రమంగా ఆస్తులు సంపాదించుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శలు చేశారు. అధికారన్ని అడ్డం పెట్టుకోని భూకబ్జాలు, అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కుంగిపోయిన కాళేశ్వరం కట్టి కేసీఆర్, హరీశ్ రావు దోషులుగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో ఉంటే, కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిందని ఆయన విమర్శించారు.

అలాగే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.

Next Story