నిన్న నోటీసులు.. ఈ రోజు స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

by Malleboina Mahesh |

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ అసెంబ్లీ స్పీకర్‌ను స్వయంగా కలిసి తన వివరణకు అదనపు సమయం కావాలని లేఖ అందజేశారు.

నిన్న నోటీసులు.. ఈ రోజు స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ న్యూయర్ ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) చేసిన వ్యాఖ్యల అనంతరం స్పీకర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు విచారణకు హాజరుకాని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari,), ఎమ్మెల్యే దానం నాగేందర్‌ (Danam Nagender)కు గురువారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)ను స్వయంగా కలిసి తన వివరణకు అదనపు సమయం కావాలని లేఖ అందజేశారు.

స్పీకర్ కడియంకు ఈ నెల 23వ తేదీన హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేయగా.. గడువుకు ముందుగానే స్పీకర్‌ను కలిసిన కడియం, తనపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి వివరణ సిద్ధం చేయడానికి కొంత మరింత సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక ఇదే కేసులో మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఆయన 23వ తేదీన హాజరవుతారా లేదా అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై తీసుకోబోయే నిర్ణయాలు, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story