- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వార్త ఎలా బయటకు వచ్చిందో తెలియదు.. జగ్గారెడ్డి యూటర్న్..!!
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ వచ్చిన వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ వచ్చిన వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ వార్త ఎలా బయటికి వచ్చిందో తనకు తెలియదని అన్నారు. కానీ ఆ వార్తను తప్పుపట్టలేను, సమర్థించలేనని కార్యకర్తలను మరోసారి కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టారు. అయినా, ఎన్నికలకు ఇంకా 16 నెలల సమయం ఉందని.. ఇప్పుడే దాని గురించి చర్చ అవసరం లేదని అన్నారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. తిరిగి 2028 ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేసినట్లు ఇవాళ ఉదయం వార్తలు వినిపించాయి. తాజాగా జగ్గారెడ్డి వాటిపై స్పందించిప్పటికీ.. సరిగ్గా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. పార్టీ నాయకత్వంపై అసహనంతో ఉన్న జగ్గారెడ్డి గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్నాడు. మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
Also Read : రేవంత్ రెడ్డికి దడ పుట్టిస్తున్న సునీల్ రిపోర్ట్






