MLA Jagadish Reddy : సస్పెన్షన్ పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్

by Muthe.Rajitha |

అసెంబ్లీ సమావేశాల(Telangana Assembly Sessions) నుంచి తనను సస్పెండ్ చేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(BRS MLA Jagadish Reddy) ఫైర్ అయ్యారు.

MLA Jagadish Reddy : సస్పెన్షన్ పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ సమావేశాల(Telangana Assembly Sessions) నుంచి తనను సస్పెండ్ చేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(BRS MLA Jagadish Reddy) ఫైర్ అయ్యారు. ఈ సస్పెన్షన్ పై డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను స్పీకర్(Speaker) ను కించపరిచేలా మాట్లాడలేదని, స్పీకర్ విలువ ఏంటో తనకు తెలుసని పేర్కొన్నారు. సభలో గవర్నర్ ప్రసంగంలో తప్పులు ఎత్తిచూపే ప్రయత్నం చేశానని, బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో ఉంటే తమ బండారం బయటపడుతుందని కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్ర ఇదని మండిపడ్డారు.

సభ అందరిది, సభలో అందరికీ హక్కులు ఉంటాయని చెప్పే ప్రయత్నం చేశానని అన్నారు. కావాలంటే రికార్డులు చెక్ చేసుకోవాలని. తాను ఏకవచనంతో సంబోధించలేదని వివరించారు. స్పష్టమైన కారణం లేకుండా తనపై కక్షగట్టి సభ నుంచి బయటికి పంపించారని అన్నారు. కేసీఆర్ ఒక్కడే పోట్లాడి తెలంగాణను సాధించడాని.. ఎన్నోసార్లు సభల నుంచి ఆయనను బయటికి పంపించారని.. చివరకి ఆ ఒక్కడే తెలంగాణను సాధించి చూపించాడని గుర్తు చేశారు. తనను బయటికి పంపినంత మాత్రాన తన గొంతు నొక్కలేరని.. ఇంకా బలంగా ప్రజల సమస్యలను ఎత్తి చూపుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువే చూశామని.. ఇవేవీ తనను ఏమీ చేయలేవని జగదీష్ రెడ్డి వెల్లడించారు.

Next Story