- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం.. ఎమ్మెల్యే దానంకు స్పీకర్ మరో నోటీసు!
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఆంటీ-డిఫెక్షన్ చట్టం) ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని BRS నేతలు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లో (అక్టోబర్ 31, 2025 నాటికి) విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ అనర్హత పిటిషన్లపై విచారణను ఇప్పటికే ప్రారంభించారు.
అయితే, విచారణను మరింత ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ విపక్ష బీఆర్ఎస్ నవంబర్ 17న సుప్రీంకోర్టులో స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటివరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. పార్టీ మారడంపై ఓ దఫా స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరికి తాజాగా స్పీకర్ మరో నోటీసులు జారీ చేశారు. గతంలో వారిద్దరికీ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోరడంతో వారు మరోసారి స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఆ నోటీసులలో అనర్హత పిటిషన్లపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ పేర్కొన్నారు.






