Danam Nagender: అనర్హత కేసుపై దానం ధీమా.. ఖైరతాబాద్‌కు బైపోల్ లేదంట!

by Ramesh Naini |

అనర్హత కేసు విషయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమాగా ఉన్నట్లు తెలిసింది. అన్ని పరిస్థితులు తనకే అనుకూలంగా ఉన్నాయని సన్నిహితుల ప్రస్తావించినట్టు పొలిటికల్ సర్కిల్‌లో విస్తృతంగా చర్చ నడుస్తున్నది.

Danam Nagender: అనర్హత కేసుపై దానం ధీమా.. ఖైరతాబాద్‌కు బైపోల్ లేదంట!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అనర్హత కేసు విషయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమాగా ఉన్నట్లు తెలిసింది. అన్ని పరిస్థితులు తనకే అనుకూలంగా ఉన్నాయని సన్నిహితుల ప్రస్తావించినట్టు పొలిటికల్ సర్కిల్‌లో విస్తృతంగా చర్చ నడుస్తున్నది. ‘స్పీకర్ కోర్టులో నాకే అనుకూలంగా తీర్పు వస్తుంది. నాపై ఉన్న అనర్హత పిటిషన్ కొట్టేస్తారు. ఆ నమ్మకం నాకుంది. స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎవరైనా హైకోర్టుకు వెళ్తే న్యాయపరంగా ఎదుర్కొంటా.. ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ వచ్చే ప్రసక్తే లేదు. నేరుగా జనరల్ ఎలక్షన్ వస్తుంది’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ తన సన్నిహితుల వద్ద మాట్లాడినట్టు పొలిటికల్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతున్నది. తాజాగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై ఉన్న అన్హరత పిటిషన్‌ను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ విషయాన్ని కొందరు సన్నిహితులు దానం నాగేందర్ వద్ద ప్రస్తావించగా.. తీర్పు తనకే అనుకూలంగా వస్తుందని కామెంట్ చేసినట్లు సమాచారం.

దానంకు అదే ప్లస్…

బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ విధంగా పోటీ చేయడంతో దానం నాగేందర్ పై స్పీకర్ కోర్టులో అన్హరత వేటు పడుతుందనే ధీమాలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. గులాబీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసే నాటికి దానం కాంగ్రెస్ ఎంపీగా పోటీచేయలేదు. ఇదే విషయాన్ని నాగేందర్ తరపున వాదిస్తున్న న్యాయవాదులు విచారణ సమయంలో సభాపతికి వివరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో బీఆర్ఎస్ దానం నాగేందర్‌కు నోటీసులు ఇవ్వలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఈ విషయాల ఆధారంగా సభాపతి కోర్టులో తనకు అనుకూల తీర్పు వస్తుందనే ధీమాలో దానం ఉన్నట్లు ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం దానం పార్టీ ఫిరాయించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసే అవకాశం ఉన్నప్పుడు అదనపు పిటిషన్లను సైతం స్పీకర్ కోర్టు కొట్టివేసే ఛాన్స్ ఉందని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

దానం, కడియంకు క్లీన్ చిట్?

ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అన్హరత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. తాజాగా విచారించిన ఆయన దానం, కడియం శ్రీహరి అన్హరత పిటిషన్లపైనా అదే తరహా తీర్పు వస్తుందని చర్చ జరుగుతున్నది. దానంకు క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కడియం శ్రీహరికి సైతం అనుకూలంగా తీర్పు వస్తుందని కాంగ్రెస్ లోని ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.

Next Story