- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Balu Nayak: రాజకీయ లబ్ధి కోసం లంబాడీలను బలిచేయొద్దు.. కేటీఆర్‌పై ఎమ్మెల్యే బాలునాయక్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కలెక్టర్, ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన ఘటనలో లగచర్ల (Lagacharla) గ్రామస్తులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించారు. తాజాగా, మరో 10 గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరికొందరి కోసం నాలుగు పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. తాజాగా, గురువారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మరికొద్దిసేపట్లోనే సంగారెడ్డి సెంట్రల్ జైలు (Sangareddy Central Jail)కు వెళ్లనున్నారు. అక్కడ లగచర్ల (Lagacharla) కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న రైతులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు.
ఈ క్రమంలోనే కేటీఆర్‌పై దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ (MLA Balu Nayak) సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజనులపై కేటీఆర్ (KTR)కు అకస్మాత్తుగా ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చిందని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ (BRS) పాలనలో లంబాడీలపై జరిగిన దాడుల సంగతేంటని ప్రశ్నించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న నాడు ఎస్టీ కమిషన్ (ST Commission) ఎందుకు గుర్తు రాలేదని ఆయన ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాయమాటలను లంబాడీలు నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు. లగచర్ల (Lagacharla) గిరిజనులకు ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తామని తెలిపారు. మీ రాజకీయ లబ్ధి కోసం లంబాడీలను బలిచేయొద్దని ఎమ్మెల్యే బాలునాయక్ (MLA Balunayak) కేటీఆర్‌కు హితవు పలికారు.