- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్ప పువ్వు సారా గొప్పతనం రేపు చెబుతా: సోషల్ మీడియా ట్రోల్స్‌కు ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్
ఇప్ప పువ్వు సారాపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇప్ప పువ్వు సారాపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్ప పువ్వు సారాపై మాట్లాడితే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. నాకు ఇప్ప పువ్వు సారాపై పూర్తి అవగాహన ఉంది. అవగాహన లేకుండా నేను మాట్లాడడం లేదు. రేపు అసెంబ్లీలో ఇప్ప పువ్వు సారా విధానంపై మాట్లాడుతాను. అన్ని వివరాలు వెళ్లాడిస్తాను. ఎవరైతే సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తున్నారో రేపు నా ప్రసంగం వినండి అని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు.
రూ. లక్షల కోట్ల రెవెన్యూ..
గతంలో ఇప్ప పువ్వు సార తాగిన వాళ్లు 115 ఏళ్లు బతికారు. కానీ ప్రస్తుతం కల్తీ బ్రాండ్ల తాగిన వారు కేవలం 60 ఏళ్ళు మాత్రమే బతుకుతున్నారు. విదేశాలలో అనేక కల్తీ బ్రాండ్లు ఉన్నాయని.. వాటికి మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది. రాష్ట్రంలో ఎస్టీ సోదరులు ఆర్థికంగా ఎదగాలంటే ఇప్ప పువ్వు సారాకు ప్రాధాన్యత కల్పించాలని తాను ప్రభుత్వాన్ని కోరతాను. తెలంగాణలో ఇప్ప పువ్వు సారతో రూ. లక్ష కోట్ల రెవెన్యూ వచ్చే విధంగా మార్కెట్ ఎక్స్‌పోర్ట్ కూడా చేయవచ్చు. అని గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివరించిన విషయం తెలిసిందే.






