ఇదంతా ఆ శక్తుల ప్రయత్నమే.. స్వగ్రామంలో కాంగ్రెస్ ఓటమిపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

స్వగ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమిపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించారు.

ఇదంతా ఆ శక్తుల ప్రయత్నమే.. స్వగ్రామంలో కాంగ్రెస్ ఓటమిపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి (Jadcherla MLA Anirudh Reddy) స్వగ్రామం రంగారెడ్డి గూడలో (Ranga Reddy Guda) బీజేపీ మద్దతు దారు గెలుపొందడం హాట్ టాపిక్ గా మారింది. స్వగ్రామంలో సొంతపార్టీకి ఎదురుగాలి వీయడంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందిచారు. సర్పంచ్ ఎన్నికలు (sarpanch elections) పార్టీల గుర్తులు లేకుండా జరుగుతాయని ప్రజలు తమకు మంచి చేస్తారని భావించే వారినే గెలిపించుకుంటారని అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపాయని ఆరోపించారు. ఇక్కడ గెలిచిన అభ్యర్థి గతంలో రెండు సార్లు ఓడిపోయారని అందువల్ల ఈ సారి సింపతీ కోసం వారికి ఓటు వేశారని చెప్పారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన అనిరుద్ రెడ్డి.. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి బరిలో నిలిస్తే ఆయనకు 13 ఓట్లు వచ్చాయన్నారు. అనిరుద్ రెడ్డిని డౌన్ చేసేందుకు బయటి నుంచి కొన్ని శక్తులు వారి వెనుకుండి నడిపించాయన్నారు. తాను ఎమ్మెల్యేగా మిగతా గ్రామాలపై ఫోకస్ చేశానని, తన సొంత గ్రామంలో తనకు సపోర్టు చేస్తారు కదా అనికుని కొంత నిర్లక్ష్యం కూడా నావైపు నుంచి జరిగిందన్నారు. మెజార్టీ గ్రామాల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేరని వ్యాఖ్యానించారు.

కాగా, గ్రామంలో అనిరుద్ రెడ్డి స్వగ్రామంలో ఉన్న మొత్తం ఓట్లలో 972 ఓట్లు పోలు కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి 459 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతికి 490 ఓట్లు వచ్చాయి. మొదట బీజేపీ అభ్యర్థి రేవతి ఆరు ఓట్ల మెజారిటీ సాధించగా.. అధికార పార్టీ నాయకులు రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. రేవతికి రీకౌంటింగ్‌లో మెజారిటీ 31 ఓట్లకు పెరిగింది.

Next Story